పాతబస్తీలో పారిశుద్ధ్యం పడకేసింది. చార్మినార్ ఖాబుతర్ ఖానా పల్కి గార్డెన్ వద్ద కొందరు రోడ్డుపై ఇంటి వ్యర్థాలను పరబోసారు. ఆ ప్రదేశంలో చెత్త కూడా పేరుకుపోతొంది. ఈ వ్యర్థాలు రోడ్డుపైకి సగం వరకు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాపిక్ జామ్ సైతం ఏర్పడుతోంది. గత పది రోజులుగా ఇదే పరిస్థితి ఉన్న అధికారులు గానీ సిబ్బంది గానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.