పాతబస్తీ పరిధిలోని పలు షాపులను శుక్రవారం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ చేశారు. 1992 డిసెంబర్ 6వ తేదిన బాబ్రీ మసీదుపై జరిగిన దాడికి నిరసిస్తూ శాంతియుతంగా షాపులను మూసి వేశారు. పాతబస్తీ పరిధిలోని సైదాబాద్, చార్మినార్, పత్తార్ గట్టి, యాకుత్ పురా, మలక్ పేట్, రెయిన్ బజార్ వంటి ప్రాంతాల్లో చాలా వరకు షాపులను వ్యాపారస్తులు మూసి వేశారు.