రంగారెడ్డి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

78చూసినవారు
చేవెళ్ల మండలం ఎన్కేపల్లిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చేవెళ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మొండి వాగు గ్రామానికి చెందిన ఇమ్రాన్ గా గుర్తించారు. డెడ్ బాడీని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్