గజ్వేల్: పుస్తక పఠనంతోనే పరిపూర్ణ వికాసం
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తక పఠనంతోనే మానవ మేధాశక్తి వికాసం చెందుతుందని గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ గురువారం పేర్కొన్నారు. కళాశాలలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శనని ఆమె ప్రారంభించి ప్రసంగించారు. పుస్తక పఠనంతోనే విద్యార్థులలో పరిపూర్ణ వ్యక్తిత్వం పెంపొందుతుందని తెలిపారు.