సిద్ధిపేట: గురుకుల విద్యాలయంను సందర్శించిన అదనపు కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురుకుల విద్యాలయాలు మరియు సంక్షేమ హాస్టల్లో కొత్త డైట్ ఇంప్లిమెంటేషన్/కాస్మోటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం సిద్ధిపేట జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ చింతమడకలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల విద్యాలయంను సందర్శించి పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త మెనూ ఛార్ట్ ను ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.