ట్యాంక్ బండ్ మీద ప్రజా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మ్యూజికల్ నైట్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన పాటలతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బోనాల పాటలు పాడుతూ అందరినీ ఉర్రూతలూగించారు. రాహుల్ సిప్లిగంజ్ పాటలు పాడగా పాటకు తగ్గట్లు పోతురాజులు నృత్యాలు చేస్తూ మరింత జోష్ నింపారు.