మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలున్నాయని, గతంలో తాగునీరు అందని గ్రామాలకు ఈసారి సరఫరా జరుగుతోందన్నారు. సాంకేతిక కారణాలతో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని స్థానిక అధికారులు తిప్పికొట్టాలని, సరఫరా లోపించినా కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం హైదరాబాద్లో హెచ్చరించారు.