మరికొన్ని గంటల్లో బిగ్ బాస్-8 సీజన్ విజేత ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ పినాలేకు అన్నపూర్ణ స్టూడియోలో అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది పల్లవి ప్రశాంత్ గెలుపుతో గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో నిషేధ ఆజ్ఞాలు ఉన్నాయని, అభిమానులు ఎవరు ఇటువైపు రావొద్దని, ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.