బోరబండ: తప్పించుకునేందుకు.. గొంతు కోసుకున్న దొంగ

51చూసినవారు
బోరబండ: తప్పించుకునేందుకు.. గొంతు కోసుకున్న దొంగ
చోరీ కేసులో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ దొంగ బ్లేడుతో గొంతు, చేతులు కోసుకున్నాడు. ఈ ఘటన బోరబండ ఠాణా పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన థామస్ న్యూ ఇయర్ సందర్భంగా జోగిపేటకు వెళ్లారు. ఈనెల 7న తిరిగి వచ్చి చూడగా ఇంట్లో దొంగతనం జరిగింది. ఎండి హాషం అనే దొంగ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లగా తనకు తాను గాయపర్చుకున్నాడు. పోలీసులు నిందితుడిని మంగళవారం ఆస్పత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్