మున్నూరుకాపుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జూబ్లీహిల్స్లోని సీఎం ఇంటిని ముట్టడించనున్నట్లు ఆయన తెలిపారు. డిమాండ్ల సాధనలో మున్నూరుకాపులు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.