షేక్ పేట్ లో శుక్రవారం వేకువజామున అగ్నిప్రమాదం జరిగిన డ్యూక్స్ అవెన్యూ భవనాన్ని హైడ్రా కమిషనర్ ఎవీ రంగనాథ్ పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను అక్కడి హైడ్రా డిఆర్ఎఫ్, పైర్ బృందాలను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న రెండో అంతస్తును పరిశీలించారు. సీసీ టీవీ పుటేజినీ పరిశీలించి అగ్నిప్రమాదానికి గల కారణాలను పరిశీలించాలని సూచించారు.