రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ గోడు వినిపించేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు నిరుద్దమని, మాజీ సర్పంచులు, ప్రతిపక్ష నాయకులు అధికార ప్రభుత్వన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.