మాజీమంత్రి పీ. జనార్ధన్ రెడ్డి( పీజేఆర్) వర్ధంతిని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం మాట్లాడుతూ. పేద ప్రజలకు అన్నివేళలా అండగా నిలిచిన నాయకుడు పీజేఆర్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి బలమైన గొంతికగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.