బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం హైదరాబాద్ నంది నగర్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని కేసీఆర్ ఆరోగ్య సౌఖ్యాలు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.