బంజావాడిలో త్వరలో నూతన కమ్యూనిటీ హల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు కార్వాన్ డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ తెలిపారు. శుక్రవారం పనులు చేపట్టే ప్రాంతాలను అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. త్వరగా ప్రణాళికలు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూడాలని అధికారులను కార్పొరేటర్ ఆదేశించారు. కమ్యూనిటీ హాల్ పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు.