అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని నానల్ నగర్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ నశిరుద్దీన్ సూచించారు. మంగళవారం డివిజన్ వార్డు కార్యాలయంలో అధికారులతో కార్పొరేటర్ సమావేశం అయ్యారు. డివిజన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గడుపు లోగా పనులన్నీ పూర్తి చేసేలా చూడాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు.