ఇందిరమ్మ ఇళ్ల సర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులకు కార్వాన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ సూచించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన పేదలు తప్పకుండా సరైన ఆధారాలు అందజేయాలన్నారు. అర్హులైన వారందరికీ తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.