వివిధ బ్యాంకుల్లో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన బ్యాంకు ఉద్యోగుల సమస్యలు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈనెల 21 నుంచి 23 వరకు ఆల్ ఇండియా రిటైరీస్ ఫెడరేషన్ (ఏ ఐ బి ఆర్ ఎఫ్) సదస్సును నగరంలో నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్సి జైన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగి కృష్ణమూర్తి తో కలిసి ఆయన మాట్లాడారు. 90వ దశకంలో పదవీ విరమణ పొందిన తాము అతి తక్కువ పెన్షన్ తో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.