ఖైరతాబాద్ లోని సింగరేణి భవన్ లో కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన బోర్డ్ సభ్యులకు బొగ్గు పెన్షన్ స్కీం సవరించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉప ప్రధాన కార్యదర్శి దండంరాజు రామచందర్ రావు, ఆళవందార్ వేణు మాధవ్ వినతి పత్రం సమర్పించారు.