మంత్రి శ్రీధర్ బాబును కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శిరి సతీష్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను, అభివృద్ది పనులను మంత్రి దృష్టికి సతీష్ రెడ్డి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సతీష్ రెడ్డి పేర్కొన్నారు.