ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కూకట్ పల్లి విభాగ్ సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలు మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణాలు పోతుంటే కనీస బాధ్యత లేని రేవంత్ సర్కార్ నిమ్మకు నిరెత్తనట్టు కూర్చుందన్నారు. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూందన్నారు. ఒక మహిళా మంత్రి అమాయక విద్యార్థులపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.