కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు బాలనగర్ అడిషనల్ డీసిపీ సత్యనారాయణ శుక్రవారం పేర్కొన్నారు. వేలంపాట జరిగే ప్రాంతంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు సృష్టించినా సహించబోమని హెచ్చరించారు. కెపిహెచ్బి కాలనీ ఫంక్షన్ హాల్ లో జరిగే హౌసింగ్ బోర్డ్ స్థలాల వేలo పాట పరిస్థితులను ఆయన స్థానిక పోలీసులతో కలిసి పర్యవేక్షించారు.