ప్రగతినగర్: ప్రమాదం జరిగితే గానీ స్పందించరా?

70చూసినవారు
కూకట్పల్లి జోన్ పరిధిలోని ప్రగతినగర్ రోడ్డులో ఐసీఐసీఐ బ్యాంకు వద్ద రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. భారీ వాహనాలు వెళ్లడంతో రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతోంది. సిబ్బందికి ఇటీవల ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని స్థానిక వ్యాపారస్థులు తెలిపారు. వాహనదారులకు కూడా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఎటువంటి ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్