చంచల్ చావుని లోని డబుల్ బెడ్ రూమ్ సముదాయాన్ని ప్రజావాణి స్టేట్ నోడల్ కమిషనర్ దివ్య దేవరాజన్ వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ లో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారులతో చెప్పుకోగా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు నోడల్ కమిషనర్ ఆదేశించారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.