వ్యక్తిగత కారణాలతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, యూపీకి చెందిన పవన్ కుమార్ (34) మౌలాలిలోని 7 ఆర్పీఎఫ్ బెటాలియన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 23 నుంచి పవన్ కనిపించకపోవడంతో సిబ్బంది గాలింపు చేపట్టారు. సోమవారం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద మృతదేహాన్ని గమనించారు. ఈ మేరకు
పోలీసులు కేసు నమోదు చేశారు.