చెంగిచెర్ల: సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

77చూసినవారు
చెంగిచెర్ల: సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
గౌడ సంఘం పెద్దలు ఆదివారం ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మొదటగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం చెంగిచెర్ల అధ్యక్షుడిగా దుర్గపు క్రిష్ణ గౌడ్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తన సహచర కమిటీ ఉపాధ్యక్షులు లోడే బాలరాజు గౌడ్, జనరల్ సెక్రెటరీ బొడిగే మల్లేష్ గౌడ్, కోశాధికారిగా పుదారి రాజు గౌడ్, మిగతా కమిటీ సభ్యుల అందరితో ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్