బోడుప్పల్ కమిషనర్ రామాలింగ ఆదేశాలతో శనివారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 1వ డివిజన్ ఫుడ్స్ కాలనీలో రెండవ అంతస్తు నిర్మాణం, 13వ డివిజన్ సర్వే నెంబర్ 63 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ ఇళ్లును కూల్చివేశారు. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.