మేడ్చల్ పట్టణంలో నిరుపయోగంగా ఉన్న పాత గవర్నమెంట్ ఆస్పత్రి భవనాన్ని మార్కెట్ యార్డ్ గా మార్చాలని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి కౌన్సిలర్ ఉమా నాగరాజు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీ లో రోడ్డు వెడల్పులో భాగంగా వ్యాపారం కోల్పోయిన బాధితులకు చిరు వ్యాపారులకు అండగా మరియు మేడ్చల్ పట్టణ జనాభా అనుగుణంగా మార్చాలని వినతి పత్రం ఇచ్చారు.