అక్రమంగా తరలిస్తున్న 26 కేజీల గంజాయిని శామీర్ పేట్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ ఎసిపి రాములు వివరాలను వెల్లడించారు. పక్క సమాచారంతో మేడ్చల్ జోన్ ఎస్ఓటీ, శామీర్ పేట్ పోలీసులు మజీద్పూర్ లోని ఓపెన్ వెంచర్ లో తనిఖీలు నిర్వహించారు. ఒడిశాకు చెందిన ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కారులో ఉన్న 14 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.