ఒకవైపు మురికి కాల్వ కంపు, మరోవైపు మురికి నీరుతో జలమయంగా మారిన రోడ్లు, ఇంకొకవైపు దోమల బెడద, ఇలా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని ధరణి కాలనీ వాసులు. డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్రవైన దుర్వాసన, దోమకాటు వల్ల రోగాల బారిన పడుతున్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సోమవారం స్థానికులు కోరుతున్నారు.