సినీనటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు. స్వయంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేసి అందజేయనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీకి కోర్టు నిన్న షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.