పూడిక తీత పనులను పరిశీలించిన కార్పొరేటర్

54చూసినవారు
మల్లేపల్లి డివిజన్ పరిధి అఫ్జల్ సాగర్ నాల వద్ద కొనసాగుతున్న పూడిక తీత పనులను డివిజన్ ఏంఐఏం కార్పొరేటర్ మహ్మద్ జాఫర్ ఖాన్ సోమవారం పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. వర్షాకాలంలో వర్షపు నీరు. మురుగు సాఫీగా వెళ్ళేలా చూడాలని సూచించారు. నాలాల నుంచి తీసిన చెత్తను కూడా త్వరగా అక్కడి నుంచి తొలగించాలని సూచించారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలన్నారు

సంబంధిత పోస్ట్