నూతన సంవత్సర వేడుకలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెంచింది. రంగారెడ్డి, హైదరాబాద్ ఎక్సైజ్, ఎస్టీఏఫ్ టీమ్లతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీ. బీ. కమల్ హాసన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారి శాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్ వేడుకల్లో నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్, డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నిఘా పెట్టాలని సూచించారు.