హైదరాబాద్ లక్డికాపూల్ కలెక్టరేట్లో 2బీహెచ్కే ఇళ్ల పట్టాలను పలువురు లబ్దిదారులకు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని, నేడు ఇళ్ల సర్వేపై మొబైల్ యాప్ను ఆవిష్కరించనున్నామని తెలిపారు.