సినీనటుడు అల్లు అర్జున్ కు ఆదివారం హైదరాబాద్ రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రావొద్దని అందులో పేర్కొన్నారు. ఆసుపత్రికి ఆయన వస్తున్నారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చారు. బెయిల్ షరతులు తప్పనిసరిగా పాటించాలని అందులో సూచించారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు.