కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగత్గిరిగుట్ట రింగ్ బస్తీలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి బాలానగర్ టీమ్ మరియు జగత్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా కిరాణా దుకాణంపై బుధవారం దాడి చేశారు. దుకాణం యజమాని బీహార్ కు చెందిన సునీల్ కుమార్ ఝాను అదుపులోకి తీసుకుని 61 ప్యాకెట్లలో ఉన్న 2400 (13 కేజీల) గంజాయి చాక్లెట్లను స్వాదీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్ రూ. 40/-లకు వలస కార్మికులకు అమ్ముతున్నట్లు తెలుస్తుంది.