కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండల్ గాగిల్లాపూర్ నందు సర్వే నంబర్ 214 ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని, అక్రమ నిర్మాణంపై పార్టీలకతీతంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అధికారులు చర్యలు తీసుకున్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.