కుత్బుల్లాపూర్ - Quthbullapur

వీడియోలు


హైదరాబాద్
కాంగ్రెస్ చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది : రాగిడి లక్ష్మారెడ్డి
May 09, 2024, 09:05 IST/ఉప్పల్
ఉప్పల్

కాంగ్రెస్ చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది : రాగిడి లక్ష్మారెడ్డి

May 09, 2024, 09:05 IST
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సర్వేలలో టాప్ లోకి బీఆర్ఎస్ పార్టీ రావడంతో గులాబీ దళం ఫుల్ జోష్ లో ప్రచారం చేపడుతుంది. అందులో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గురువారం ఉప్పల్ నియోజకవర్గం లోని కాప్రా డివిజన్, సాయిబాబా నగర్ నుండి భారీ ర్యాలీ పాదయాత్ర ప్రారంభమై ఏ ఎస్ రావు నగర్, చర్లపల్లి మీదుగా కుషాయిగూడ వరకు ఎన్నికల ప్రచారంలో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇంఛార్జి మహమ్మద్ జహంగీర్ పాషా, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగరెడ్డి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమానికి సీనియర్ నాయకులు 1వ వార్డు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వార్డు లోని ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని డోర్ స్టిక్కర్స్ వేస్తూ కర పత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఐదు నెలల్లోనే 10 యేండ్లు వెనుకకు నెట్టి వేయబడ్డదని, మళ్ళీ పునర్నిర్మాణం జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి ప్రశ్నించే గొంతుకను చట్ట సభల్లో నిలపాలన్నారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలతో మాయ మాటలు చెప్పి అధికారం లోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో బంధీ అయ్యిందన్నారు. ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఉద్యమకారులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.