తొలి విడతలో పది లక్షల ఇందిరమ్మ ఇండ్లు

76చూసినవారు
తొలి విడతలో పది లక్షల ఇందిరమ్మ ఇండ్లు
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా మొదటి దశలో ఒకేసారి పది లక్షల గృహాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి సీఎం వద్ద శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం. లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయిలో అంగన్‌వాడీ, ఆశా, గ్రామ కార్యదర్శితో పాటు స్థానికంగా ఉండే వారితో కలిపి కమిటీలను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గృహ నిర్మాణశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్