ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఏండిఏ గ్రౌండ్ వద్ద హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఎదురుపడిన పారిశుద్ధ్య సిబ్బందిని పలకరించారు. సీఎం రేవంత్ డిప్యూటీ సీఎంను వారికి పరిచయం చేశారు. వారి ఆరోగ్య బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.