పేదల ఉపాధి జోలికొస్తే తెగించి కొట్లాడతామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాంగోపాల్పేట్, బేగంపేట్, మోండా మార్కెట్ పరిధిలోని ఫుట్ పాత్ వ్యాపారులు వచ్చి ఆయనకు తమ గోడును విన్నవించుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చిరువ్యాపారాలు చేసుకుంటున్న తమను ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.