సికింద్రబాద్ కంటోన్మెంట్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద యూత్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఒకరి ప్రాణం కాపాడినట్లు అవుతుందని ఎంపీ పేర్కొన్నారు. రక్తదానం చేసిన వారిని అభినందించారు.