తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ విద్యా దినోత్సవాన్ని ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లోని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు--మనబడి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరయ్యారు. అస్మంత్ పెట్ లోని ప్రభుత్వ పాఠశాలలో జెండా ఆవిష్కరణ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లయ్య మాట్లాడుతూ పిల్లలకు ఎమ్మెల్యే సొంత నిధులతో బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేశారని అన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల పాఠశాల సరిపోవడం లేదని, ప్రభుత్వ స్థలంలో నూతన పాఠశాల నిర్మించాలని ఎమ్మెల్యే ను కోరారు. ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ స్కూలు పిల్లలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం అని, అతి త్వరలో మీరు కోరినట్టుగా పాఠశాలకు స్థలమును, అన్ని సదుపాయాలతో పాఠశాలను నిర్మిస్తామని తెలిపారు. పాఠశాలలో నూతన డిజిటల్ తరగతులను, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభం చేశారు. మూసాపేటలో రెండు ఎకరాల స్థలంలో ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తున్నామని చెప్పారు. దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, ప్రతి విద్యార్థి సంవత్సరానికి ఒక లక్ష 25 వేల రూపాయలను ఇస్తున్నామని, విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని
కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రే జంగయ్య, మక్కల నర్సింగ్ రావు, గడ్డం నర్సింగ్ రావు, డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, డివిజన్ సెక్రెటరీ హరినాథ్, నియోజకవర్గ మైనారిటీ ప్రెసిడెంట్ ఇజాజ్ బాయ్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి, బీసీ సెల్ అధ్యక్షులు మట్టి శ్రీనివాస్, మైనారిటీ ప్రెసిడెంట్ జాంగిర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.