తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లోని అంజయ్య నగర్, బోయిన చెరువు ప్రక్కన దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు మాజీ కౌన్సిలర్ మక్కాల నర్సింగ్ రావు, హాజరై దొడ్డి కొమురయ్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంసెన్సీ మైనార్టీ ప్రెసిడెంట్ ఇజాజ్, మార్కెట్ వైస్ చైర్మన్ ఉదయ యాదవ్, 119 డివిజన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బుర్రి యాదగిరి, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.