బొల్లారంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి మొత్తం తిరిగి వైద్య సదుపాయాలు, రోగుల యోగక్షేమాలు, సిబ్బంది సమస్యలను వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చాయన్నారు. అనంతరం ఆయన సానుకూలంగా స్పందించి మందులు సకాలంలో వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.