దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు, దాండియా నిర్వాహకులతో బోయిన్ పల్లిలోని క్లాసిక్ మైదానంలో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ మండప ఏర్పాటు, విగ్రహ ప్రతిష్టాపన నిమజ్జన ఊరేగింపు, ఫంక్షన్ హాల్స్ లో జరిగే దాండియా కు డీజే శబ్దాలు, టపాసులు కాల్చడం పైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.