సికింద్రాబాద్ నుంచి బేగంపేట వెళ్లే రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట ఫ్లైఓవర్ పైన 2 కార్లు ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయిందని పోలీసులు తెలిపారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు.