సికింద్రాబాద్: విద్యార్థులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు

56చూసినవారు
పోలీసు అధికారుల ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు ఆధ్వర్యంలో మంగళవారం బోయిన్పల్లి ట్రాఫిక్ పోలీసులు పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఈ మేరకు బోయిన్పల్లిలో విద్యార్థులకు వాహన కాలుష్యం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉల్లంఘన, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్