గాంధీ ఆసుపత్రి వెనుక ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది మంది ఈ రూట్లో రాకపోకలు సాగిస్తుంటారు. కొంతమంది ఇక్కడే మూత్ర విసర్జన చేయడం గమనార్హం. ఇకనైనా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే పేరుకుతున్న చెత్తను కూడా తొలగించాలన్నారు.