సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా 4. 858 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని దాని విలువ రూ. 1. 2 లక్షలు అని పోలీసులు అంచనా వేశారు. ఒడిశా రాష్ట్రంలోని బెహ్రాంపూర్ నుంచి మహారాష్ట్రలోని దాదర్ కు సికింద్రబాద్ రైల్వే స్టేషన్ మీదుగా గంజాయి తరలిస్తుండగా నిందితులు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.